సుశాంత్‌ సింగ్‌ మ‌ర‌ణం త‌ర్వాత వారిని అన్ ఫాలో చేస్తున్న నెటిజ‌న్లు

సుశాంత్‌ సింగ్‌ మ‌ర‌ణం త‌ర్వాత వారిని అన్ ఫాలో చేస్తున్న నెటిజ‌న్లు

0
80

ఏ బాధ వ‌చ్చిందో ఏమి అయిందో తెలియ‌దు కాని సుశాంత్ మ‌ర‌ణం ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు, ఎందుకు ఇంత దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారా అనే బాధ ప్ర‌తీ ఒక్క‌రిలో ఉంది. సుశాంత్‌ మృతికి సంతాపం తెలుపుతూ గతకొన్నిరోజుల నుంచి నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌కు చెందిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల సుశాంత్ ఎంతో ఇబ్బంది పడ్డాడ‌ని.

చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అని అంటున్నారు, అవ‌కాశాలు రాకుండా చేశార‌ని ఒకే చేసిన7 సినిమాలు త‌న‌కు రాకుండా చేశార‌ని అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్‌లోని అగ్రనిర్మాతలు, దర్శకులు.. వారసత్వ నటులకే ఆఫర్స్‌ ఇచ్చారని, అవార్డుల ఫంక్షన్స్‌లో సైతం వారికే ప్రాధాన్యమిచ్చారంటూ పోస్టులు చేస్తున్నారు.

అందుకే ఇలా వార‌స‌త్వంతో క‌టింగ్ ఇస్తూ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర సినిమా ఛాన్స్ లు కొడుతూ టాలెంట్ లేని కొంద‌రు న‌టుల‌ని అన్ ఫాలో చేస్తున్నారు నెటిజ‌న్లు, ట్విటర్‌, ఇన్‌స్టా, ఇతర సోషల్‌మీడియా వేదికల్లో సదరు నటీనటులను అన్ ఫాలో చేస్తున్నారు.