సుశాంత్ సింగ్ ని బెదిరించిన రియా కాల్ డేటా లీక్ – ఏమ‌ని బెదిరించిందంటే

సుశాంత్ సింగ్ ని బెదిరించిన రియా కాల్ డేటా లీక్ - ఏమ‌ని బెదిరించిందంటే

0
109

సుశాంత్ సింగ్ మంచి భ‌విష్య‌త్ ఉన్న సినిమా న‌టుడు, కాని అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అంద‌రిని క‌లిచివేసింది.. అతని ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టు ఇప్పుడు అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి, అస‌లు ఎందుకు ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు, దీని వెనుక కార‌ణాలు ఏమిటి అనేది పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

అయితే తాజాగా ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించిన కాల్ డేటాను ఓ నేషనల్ మీడియా చానెల్ బయట పెట్టింది, అందులో అనేక విష‌యాలు తెలుస్తున్నాయి.. జనవరి 20 నుంచి ఐదు రోజుల వ్యవధిలో రియా ఫోన్ నుంచి సుశాంత్ కు 25 ఫోన్ కాల్స్ వెళ్లాయని, అన్ని సార్లు ఎందుకు ఫోన్ చేసిందన్న విషయంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు

ఆమె బెదిరించింది అని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి, సుశాంత్ తన సోదరితో కలిసి చండీగఢ్ లో ఆ స‌మ‌యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది, త‌న ద‌గ్గ‌ర‌కు రావాలి అని రియా కోరింది, అందుకే అత‌ను సిమ్ మార్చిన‌ట్లు తెలుస్తోంది.తనను మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలని రియా, తన కుటుంబీకులతో కలిసి ప్రయత్నిస్తోందని, తనకు హాస్పిటల్ లో చేరడం ఇష్టం లేదని చెప్పార‌ట‌.సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించారు ఈ విష‌యాలున్నీ సీబీఐ ఇంట‌రాగేష‌న్ చేయ‌నుంది.