ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చిన శ్యామ్..

0
126

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అటు తెలుగులో  ఇటు తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో మనందరినీ ఆకట్టుకుంది.

2017 సంవత్సరంలో నాగచైతన్యను పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న వివాదాల వల్ల ఆరు నెలల కింద  విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రేమ విషయంలో శ్యామ్  సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని షాక్ కు గురిచేస్తుంది. సోషల్‌ మీడియా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు వెంటనే క్లారిటీ ఇచ్చింది.

ఒకేసారి అంతులేని ప్రేమ‌, ద్వేషాన్ని స్వీక‌రించాల్సి వ‌స్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంద‌ని ప్రశ్నించడంతో దానికి ఆమె స్పందించి ప్రేమకు కానీ, ద్వేషానికి కానీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం శ్యామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.