సిద్దార్ద్ – స‌మంత ఎందుకు విడిపోయారంటే

సిద్దార్ద్ - స‌మంత ఎందుకు విడిపోయారంటే

0
110

ఎవ‌రి జీవితంలో అయినా ప్రేమ విడిపోవ‌డం ఇలాంటివి చాలా ఉంటాయి ..ప్రేమించిన ప్ర‌తీ ఒక్కరూ పెళ్లి చేసుకోరు.. కాని పెళ్లి చేసుకున్న ప్ర‌తీ ఒక్క‌రు భార్య భ‌ర్త ప్రేమించుకోవ‌చ్చు.. ఇక సినిమా ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటివి ప్రేమ‌లు ఉంటాయి, త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పుకున్న జంట‌లు ఉన్నాయి.

ఇక అక్కినేని స‌మంత చైత‌న్య‌ని వివాహం చేసుకుంది. వారి లైఫ్ బాగానే ఉంది.. కాని తాజాగా ఆమె పాత గుర్తులు మ‌ళ్లీ త‌వ్వుకుంటోంది, ఇది ఇప్ప‌డు చైతూ నాగ్ స‌మంత అభిమానుల‌ని షాక్ కి గురి చేస్తోంది,
ఎందుకు అంటే గ‌తంలో చైతూతో రిలేష‌న్ కు ముందు ఆమె హీరో సిద్దార్ద్ తో ప్రేమ‌లో ఉంది, అయితే ఏమైందో ఏమో ఇద్ద‌రూ మ‌ళ్లీ విడిపోయారు.

తాజాగా ఆ విష‌యం గురించి ఆమె చెబుతోంది.మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత త‌న మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి గుర్తు చేస్తూ…అలా జ‌రిగి ఉంటే అల‌నాటి సావిత్రి జీవితంలా అయిపోయేద‌ని చెప్పింది, ఆమెకి ఎన్ని క‌ష్టాలు వ‌చ్చాయో నా జీవితంలో అవే చోటు చేసుకున్నాయి అని చెప్పింది ఆమె, అందుకే జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌ప‌డ్డా అని చెప్పంది, ఇక చైతూ లాంటి గొప్ప వ్య‌క్తి నాకు దొరికినందుకు చాలా ఆంన‌దంగా ఉంది అని చెప్పింది.