బ్రేకింగ్ –టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఇంట విషాదం

బ్రేకింగ్ --టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఇంట విషాదం

0
90

టాలీవుడ్ లో వ‌రుస విషాదాలు జ‌రుగుతున్నాయి, ఈ క‌రోనా స‌మ‌యంలో చాలా మంది ప్ర‌ముఖులు సినిమా ప‌రిశ్ర‌మ నుంచి దూరం అయ్యారు, తాజాగా సింగ‌ర్ ఇంట విషాదం నెల‌కొంది.
ప్రముఖ గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి కన్నుమూశారు.

త్రివేణినగర్‌లో వారు నివాసం ఉంటున్నారు, ఆమె కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు, ఆమె వ‌య‌సు 70 ఏళ్లు అని తెలుస్తోంది, ఆమె పేరు జానకి.. కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వ‌హించారు, ఈ కార్య‌క్ర‌మానికి కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు కొంద‌రు మాత్ర‌మే హాజ‌రు అయ్యారు.

కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈ విష‌యం తెలుసుకున్న సినీ రంగ ప్రముఖులుకారుణ్య‌కి ఫోన్‌లో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్‌ ఐడల్ కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌లు పాట‌లు పాడుతూ టాలీవుడ్ లో బెస్ట్ సింగ‌ర్ గా నిల‌దొక్కుకున్నారు.