టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత(Singer Sunitha) మరోసారి తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సునీత రెండో పెళ్ళి అయినప్పటి నుంచి నెట్టింట ఆమెకు సంబంధించి అనేక రూమర్లు ప్రచారమవుతున్నాయి. పెళ్ళయిన రెండు మూడు రోజులకే ఆమె హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లిందంటూ కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఆమె మరోసారి తల్లి కాబోతోందని, అందుకనే సోషల్ మీడియాకు కూడా కాస్తంత దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా వీటిపై ఇప్పటి వరకు సునీత కానీ ఆమె కుటుంబీకులు కానీ స్పందించలేదు. రెండో పెళ్లయినప్పటి నుంచి సునీత.. సోషల్ మీడియాకు కాస్త దూరం పాటిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ దూరం ప్రెగ్నెన్సీ వల్లే అని మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ వార్తలపై సునీత(Singer Sunitha) స్పందించారు. తనపై ఇష్టమొచ్చినట్లు రూమర్లు పుట్టిస్తున్నారంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారామే. తన రెండో పెళ్ళయినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వినిపించాయని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని పలుసార్లు స్పష్టత ఇచ్చినప్పటికీ ఆ రూమర్లకు బ్రేకులు పడలేదు. పలు సందర్భాల్లో ఈ వార్తలపై సునీత మండిపడ్డారు కూడా. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. దీంతో వాటిని పట్టించుకోవడం మానేశానని సునీత చెప్పారు. ఇప్పుడు ఆమె తల్లి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. వాటిలో కూడా వాస్తవం లేదని, ఇటువంటి రూమర్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.