ZEE తెలుగు ఛానల్లో వస్తున్న సరిగమప The Singing Icon షోలో శర్వానంద్ హీరోగా నటించిన జాను చిత్రంలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట పాడి అందరి చేత ప్రశంసలు పొందాడు..యశశ్వి కొండెపూడి అతనిని షమ్మి అని పిలుస్తారు, ఆయన సొంత ఊరు కాకినాడ, ఇక ఆయన తండ్రి శేఖర్ తల్లి శ్రీదేవి…చిన్నతనం నుంచి పాటలు బాగా పాడేవాడు యశశ్వి, ఆ సమయంలో సంగీతం నేర్పించారు, అలా చిన్నతనం నుంచి కీబోర్డు కూడా ప్లే చేసేవాడు, ఓ రోజు చిన్న వయసులో బాలు గారు పాటలు పాడుతుంటే ఓ షోలో కీ బోర్డు ప్లే చేశాడు, దీంతో బాలు గారు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని తెలిపారు.
ఇక ఆయన సంగీతంలోనే కాదు ఇటు సింగర్ గానే కాకుండా చదువులో కూడా ముందు ఉన్నారు.. ఆయన ఆంధ్రా కాలేజీలో మెడిసన్ చదువుతున్నారు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఇక ఆయనకు చెల్లెలు ఉంది.. ఆమె కూడా సింగర్,
కారు బస్సు పడవ ఇలా అన్నీ నడుపుతారు లాంగ్ జర్నీ ట్రిప్పులు అంటే అతనికి చాలా ఇష్టం,ఇక అతని చెల్లి కూడా డాక్టర్ మెడిసన్ చదువుతోంది.
ఇటీవల వైకే బ్యాండ్ స్టార్ట్ చేశారు, చెల్లి సింగర్ గా అతను సింగర్ గా కీ బోర్డు వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటారు, పలు ఈవెంట్లు చేశారు, ఇక యశశ్వి 2009 నుంచి శ్రీ జాన్సీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, ఆమె కూడా బీఫార్మ్ చదువుతోంది.
కాకినాడ నుంచి స్కూ్లో చదువుకునే సమయం నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, ఆమె పలు పాటలు పాడింది… సింగర్ కమ్ యాక్టర్ గా ఉన్నారు. త్వరలో వివాహం చేసుకోనున్నారు.