ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను సాగిస్తున్నారు. ముందు నుంచి తన వెనుక ఉన్న నేతలకు మాత్రమే కీలక పదవులు ఇస్తున్నారు జగన్.
కొద్ది నెలల క్రితం ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవిని నటుడు పృధ్వీకి కట్టబెట్టగా, లక్ష్మీ పార్వతికి ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా సీనియర్ నటుడు విజయ్ చందర్‌కి ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు, సీనియర్లకు గౌరవం ఇస్తున్నారు అనేది జగన్ తాజాగా తెలుస్తోంది. అయితే ఆయన ఈ పదవిని తీసుకోరు అని వార్తలు ఎల్లో మీడియాలో వస్తున్నాయి. తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియాలు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం కరెక్ట్ కాదు అని అంటున్నారు వైసీపీ నేతలు.
అయితే ఆయన ఎమ్మెల్సీ రాజ్యసభ సీటు వస్తుంది అని అనుకున్నారట.. కాని జగన్ ఆయనకు ఈ పదవి ఇవ్వడం పట్ల ఆయన పదవి తీసుకోవడానికి ఇష్టం చూపించడం లేదు అని వార్తలు వైరల్ చేస్తున్నారు… కాని ఇది వాస్తవం కాదు అని వైసీపీ నేతలు అంటున్నారు.. కావాలనే ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు, ఆయన ఈ పదవి తీసుకోవడానిక ఆసక్తి చూపిస్తున్నారట.