సిరివెన్నెల ఇక సెలవు..అశ్రునయనాలతో అంతిమయాత్ర

Sirivennela is no longer a holiday..funeral with tears

0
111

తెలుగు సాహిత్య సామ్రాట్ సిరివెన్నెల కన్నుమూతతో సినీ పరిశ్రమ మూగబోయింది. ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం 5 గంటలనుంచి ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీప్రముఖుల, అభిమానుల సందర్శనార్ధం ఉంచారు.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఇక ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియలను తీసుకువెళ్తున్నారు కుటుంబసభ్యులు. సిరివెన్నెల సాహిత్యం ఎన్నో లక్షల గుండెలను కదిలించింది. ఆయ్న పాట ఎన్నో వందల మంది గొంతులో తీణికిసలాడింది. వేలాదిమంది అభిమానుల ఆశ్రునయనాలమధ్య తెలుగు సాహిత్య సారధి సెలవంటూ కదిలారు.