సీతారామం హీరో ఆసక్తికర కామెంట్స్..షారుఖ్ తో పోలిస్తే ఆయనకే అవమానం అంటూ..

0
114

సీతారామం సినిమాతో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సాలిడ్ హిట్ కొట్టిన విషయం అందరికి విదితమే. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి తెలుగులోనూ భారీ హిట్ ను సొంతం చేసుకుంది ఈ ప్రేమకథా చిత్రం. లెఫ్టినెంట్ రామ్, సీత పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ హను రాఘవపూడి సక్సెస్ సాధించాడు.

ఇక ఈ సినిమాలో పాటలు కూడా హైలైటే. ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ తన నటన, అందంతో ఆకట్టుకుంది. రామ్ రాసిన లేఖను సీతకు అందజేయడానికి రష్మీక, తరుణ్ భాస్కర్ పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. ఇదిలా ఉంటే..తాజాగా దుల్కర్ సల్మాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో విలేకరి దుల్కర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో పోల్చారు. దీనిపై దుల్కర్ మాట్లాడుతూ..షారుక్ కు నేను పెద్ద అభిమానిని. ఆయన స్టార్ అయిన అభిమానులతో, ముఖ్యంగా మహిళలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. కేవలం మంచి నటుడే కాదు. మంచి వ్యకిత్వం ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి ఒక్కరే వుంటారు. నన్ను ఆయనతో పోల్చడం దాదాపు ఆయనను అవమానించినట్లే అని అన్నారు.