Sivakarthikeyan | తెలుగబ్బాయి అయిపోయిన తమిళ హీరో.. కితాబిచ్చిన నితిన్

-

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) తాజాగా ‘అమరన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. దీపావళి పండగ సందర్బంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా దీపావళి టపాసులను మించిన సౌండ్‌తో పేలింది. తొలి రోజే రూ.21 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్బంగా మూవీ టీమ్ హైదరాబాద్ వేదికగా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌కు టాలీవుడ్ డైనమిక్ హీరో నితిన్ కూడా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లో నితిన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమరన్ సినిమాకు సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ నితిన్(Nithin) చెప్పుకొచ్చాడు.

- Advertisement -

‘‘సాయి పల్లవి(Sai Pallavi).. మీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒకరోజు మీతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని, రావాలని కోరుకుంటున్నా. శివ కార్తికేయన్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇద్దరం హైదరాబాద్‌లోనే ఉన్నా నాలుగేళ్లుగా కలవడం కుదర్లేదు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ‘అమరన్(Amaran)’తో శివకార్తికేయన్ కూడా తెలుగబ్బాయి అయిపోయాడు. ఈ తెలుగు హీరోకు తెలుగు తమ్ముళ్ల నుంచి అద్భుతమైన ఆదరణ లభించడం ఖాయం. కొన్నాళ్లు పోతే శివకార్తికేయన్(Sivakarthikeyan).. తమిళ నటుడేనా అని అడిగే పరిస్థితులు వస్తాయి’’ అని నితిన్ చెప్పుకొచ్చాడు.

Read Also: కొవ్వు కోవాలా కరగాలా.. ఇవి తినేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...