ఆరు నెలల టైం పెట్టుకున్న చిరు దేనికంటే

ఆరు నెలల టైం పెట్టుకున్న చిరు దేనికంటే

0
91

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని చాలా మంది దర్శకులకు కోరిక ఉంటుంది… ఇప్పటికీ చాలా మంది యంగ్ దర్శకులు మెగాస్టార్ కోసం స్టోరీలు రెడీ చేస్తున్నారు.. అయితే ఆయనకు నచ్చిన స్టోరీ వస్తే వెంటనే దర్శకుడికి ఒకే చెబుతారు చిరంజీవి… తాజాగా సైరా సినిమా తర్వాత, దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా స్టోరీ పై సంవత్సరం వర్క్ చేశారు కొరటాల శివ.

అయితే ఈ సినిమాలో యంగ్ లో డిఫరెంట్ గా కనిపించనున్నారు మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.. ఇక వచ్చే రెండు వారాల్లో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఈ చిత్రాన్ని చిరంజీవి ఆరునెలల్లో పూర్తి చేయాలి అని చెప్పారట.. కొరటాల కూడా ఆరు నెలల టైం పెట్టుకున్నారు అని తెలుస్తోంది.. అంతేకాదు సినిమా విడుదల డేట్ ని కూడా ముందే చెప్పాలి అని భావిస్తున్నారట.. ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో చిరంజీవి కొరటాల వున్నారని అందుకే ఆరునెలలు షూటింగ్ పూర్తి చేసుకుని చిత్రం సెట్స్ పై నుంచి ఎడిటింగ్ కు వెళ్లాలి అని భావిస్తున్నారట. మొత్తానికి ఇందులో చిరు ద్విపాత్రాభినయం అంటూ వార్తలు వస్తున్నాయి. కాని అది అవాస్తవం అని తెలుస్తోంది.