6 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్

6 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్

0
97

చాలా మంది హీరోయిన్లు అవకాశాలు వచ్చిన సమయంలో వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఉంటారు, అవకాశాలు లేని సమయంలో కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు, మరికొందరు అవకాశాల కోసం చూస్తు ఉంటారు.

ముద్దుగా,బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

 

ఆమె అన్నీ సూపర్ హిట్ సినిమాలు చేసింది…రవితేజ, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలతో నటించింది, ఇక

2014లో దుబాయ్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకొంది. ఇప్పుడు సినిమాల్లో చేయాలి అని ప్లాన్ చేసుకుంది ఆమె.

 

ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది, ఈ చిత్రం గురించి దర్శకుడు స్వయంగా వెల్లడించారు.. తెలుగులో అల వైకుంఠపురంలో నటించిన జయరాం, మీరా జాస్మిన్లు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇక ఆమె అభిమానులు ఈ వార్త తెలిసి చాలా ఆనందంలో ఉన్నారు.