ఆరు నెల‌ల క్రితం టైటిల్ ప్ర‌క‌టించిన బ‌న్నీ ఇదిగా సాక్ష్యం

ఆరు నెల‌ల క్రితం టైటిల్ ప్ర‌క‌టించిన బ‌న్నీ ఇదిగా సాక్ష్యం

0
95

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్బంగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఫ్యాన్స్ దుమ్ములేపారు, కొన్ని ల‌క్ష‌ల పోస్టులు కామెంట్లు విషెస్ ఆయ‌న‌కు చెప్పారు అభిమానులు ..పాన్ ఇండియా హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు బ‌న్నీ, ఇక తాజాగా ఇప్పుడు సుకుమార్ తో సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు టైటిల్ ప్ర‌క‌టించారు.

ఈ చిత్రం పేరు పుష్ప. నిజంగా ఇందులో వెరైటీ గెట‌ప్ లో ఉన్నాడు బ‌న్నీ, అయితే ఈ టైటిల్ ను గత ఏడాదే రివీల్ చేశాడు అల్లు అర్జున్. అది ఎలా అనుకుంటున్నారా.. గత ఏడాది నవంబర్ 27న డైరెక్టర్ సుకుమార్ తో కలిసి దిగిన ఫోటోను బన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ సుక్కు హెయిర్ కలర్ చేంజ్ అయ్యింది, నా స్కిన్ కలర్ మారింది మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ త‌గ్గ‌లేదు అని అన్నాడు.

ఇక్క‌డ‌తో అంతా బాగానే ఉంది, కాని చివ‌ర్లో మాత్రం పుష్ప అనే అర్ధంవ‌చ్చేలా సింబ‌ల్స్ పెట్లాడు, ఇక అప్పుడు ఎవ‌రూ దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు, కాని తాజాగా చూస్తే మాత్రం ఆనాడే టైటిల్ చెప్పేశాడు మ‌నం చూడ‌లేదు అని అభిమానులు అనుకుంటున్నారు.

లింక్ ఇదే చూడండి మీరే ఆ టైటిల్ ని..