సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత

Slight illness for senior actor Kaika

0
130

తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల నొప్పులు తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు.

1959లో కైకాల న‌టించిన తొలి చిత్రం ‘సిపాయి కూతురు’ విడుద‌లైంది. అలా నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన..61 సంవ‌త్స‌రాల పాటు అనేక పాత్రలు పోషించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కైకాల సత్యనారాయణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ఓ పేజీని లిఖించుకున్న సీనియర్ నటుడు. సినీ రంగంలో ఉన్న కైకాల సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.