‘మా’ బిల్డింగ్ పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

Snow Vishnu Key Comments on 'Our' Building

0
94

‘మా’ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. అసోసియేషన్‌ భవన నిర్మాణమే తన ఏజెండా అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంచు విష్ణు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ..అసోసియేషన్‌కు మంచి చేస్తానని తనను ఎన్నుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమాలకు కొత్తదనం తీసుకురావలన్నదే తన లక్ష్యమని అన్నారు. అందుకే ప్రతి చిత్రానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేస్తామని తెలిపారు.

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పటికే తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన ప్రధాన అజెండాల్లో ఒకటైన ‘మా’ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఇటీవల వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.