‘మా’ ఎన్నికలు: మంచు విష్ణు ప్యానెల్ మేనిఫెస్టో విడుదల

Snow Vishnu Panel Manifesto Released

0
100

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు తన ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేశారు. మా ఎన్నికల్లో తన ప్యానెల్ గెలిస్తే నా సొంత డబ్బుతో మా భవనం నిర్మిస్తాం. అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యా సాయం.. అర్హులైన సభ్యులకు పెళ్లి ఖర్చుల కోసం కల్యాణలక్ష్మి తరహాలో రూ.1,16,000 సాయం చేస్తాం. నటీనటుల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం. ప్రభుత్వంతో మాట్లాడి మా సభ్యులకు సొంత ఇల్లు ఇప్పించే హామీ నాది.

‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు అందజేస్తాం. కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం. ‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50 శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం. అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్‌ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు చేస్తాం.

తాము గెలిస్తే ఏమి చేస్తామో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. కాగా 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

MAA – Manifesto