వైరల్ అవుతున్న చైతన్య, శోభిత వెడ్డింగ్ కార్డ్.. ఎలా ఉందంటే..

-

Naga Chaitanya Wedding Card | హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల.. మూడు ముళ్ల బంధంతో ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం టాలీవుడ్ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. సమంతతో విడాకుల తర్వాత చైతు మరో పెళ్ళికి రెడీ అవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా చైతు, శోభిత పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అతిథులకు ఆహ్వాన పత్రికలు కూడా అందడం మొదలైంది. డిసెంబర్ 4న వీరిద్దరూ మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగనుందని సమాచారం. ఇప్పటికే ఈ వేడుకకు కావాల్సిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు వీరి వివాహ వేడుక ఆహ్వాన పత్రిలకు అందిస్తున్నారు. తాజాగా ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Naga Chaitanya Wedding Card | ఇందులో పెళ్ళి పత్రికతో పాటు బంధువులకు చిన్నపాటి బుట్టను కూడా బహూకరిస్తున్నారు. ఇందులో చీర, పసుపు, కుంకుమ, వెండి వస్తువు ఉన్నాయి. వీటిని అందించే చైతు-శోభితల పెళ్ళికి అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ పెళ్ళి కార్డులో వధువు, వరుడు తల్లిదండ్రులతో పాటు తాత, బామ్మల పేర్లను కూడా చేర్చారు. ఇందులో ‘ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీ శుభాకాంక్షలు, దీవెనలు మాకు దక్కే గొప్ప గౌరవం’ అని ఈ పెళ్ళి ఆహ్వాన కార్డులో పేర్కొన్నారు.

Read Also: మధుమేహం ఉందా.. ఈ ఆహారాలను మర్చిపోవాల్సిందే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...