సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన నటి చార్మీ – కారణం ఇదే

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన నటి చార్మీ - కారణం ఇదే

0
142

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది చార్మి, హీరోయిన్ గా అగ్రశ్రేణి హీరోలు అందరితోనూ ఆమె నటించింది.. కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు, ఇక నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది చార్మీ.. దర్శకుడు పూరీతో కలిసి నిర్మాణ రంగంలోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు చార్మీ..తాజాగా చార్మి ఊహించని నిర్ణయం తీసుకుంది.. సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

 

 

దీంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు, ఛార్మీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని షాక్ అవుతున్నారు, అయితే దీనికి కారణం కూడా ఆమె చెప్పింది… సోషల్ మీడియాలో కరోనా వార్తలు చూడలేకపోతున్నా ..రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్పింది.. ఆ దృశ్యాలు వార్తలు చూడలేనని ..కరోనా పరిస్థితులను చూసి తట్టుకునే పరిస్థితి తనకు లేదని తెలిపింది.

 

ఈ కారణంతో తాను సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నా అని తెలిపింది. ప్రతీ ఒక్కరు జాగ్రత్తల తీసుకోవాలి అని తెలిపింది చార్మీ.

 

 

.