బిగ్ బాస్ హౌస్ లోకి సాధారణంగా ఎంట్రీ ఇచ్చిన సోహెల్ కథ వేరుంటది అంటూ నిజంగా కధే మార్చేశాడు. ఇక టాప్ 5లో నిలిచి గట్టి పోటీ ఇచ్చాడు అందరికి. ఇక అఖిల్ అభిజిత్ సోహెల్ వీరి ముగ్గురిలో ఎవరు విన్ అవుతారా అని అందరూ ఆలోచన చేశారు.. ఫైనల్ గా అభిజిత్ విన్నర్ అయితే, అఖిల్ రన్నరఫ్ గా నిలిచారు. ఇక సోహెల్ సెకండ్ రన్నర్ గా నిలిచి 25 లక్షల ప్రైజ్ మనీతో బయటకు వచ్చాడు.
ఓపక్క సినిమాలు సీరియల్లు చేసినా రాని గుర్తింపు సోహెల్ కు బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది అని చెప్పాలి.. కోట్లాది మంది ఉన్న రెండు తెలుగు స్టేట్స్ లో ఇలా బిగ్ బాస్ హౌస్ లో అవకాశం రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మరి సోహెల్ కు ఎలా అవకాశం వచ్చింది అనేది తెలిపాడు.
నాకు మాటీవీలో తెలిసిన అన్న ఒకతను ఉన్నారు. ఆయనతో బిగ్ బాస్లోకి వెళ్తాను అని చెప్పా. ఇలా బిగ్ బాస్ కు వెళ్లాలి అనే కోరిక చెప్పడమే కాదు ఆయనకి ఫోన్ మెసేజు లు చేసేవాడిని, తర్వాత ఓరోజు ఆయన కాల్ చేసి చెప్పారు,
ఎంట్రీ ఓకే అయిందని ..ఆ అన్న చేసిన హెల్ప్తో నేను బిగ్ బాస్లోకి వెళ్లాను అని తెలిపారు సోహెల్, ఇక తాజాగా హీరోగా ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు సోహెల్.