ఆరెస్సెస్ చీఫ్ పై సోనం కపూర్ సీరియస్

ఆరెస్సెస్ చీఫ్ పై సోనం కపూర్ సీరియస్

0
74

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దేశంలో ఆరెస్సెస్ వాదులు అందరూ ఆయనంటే ఎంతో అభిమానం చూపిస్తారు… అయితే బీజేపీ పెద్దలు కూడా ఎంతో బాగా సఖ్యతతో ఉంటారు, అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు కారణం అవుతున్నాయి.

ప్రస్తుత కాలంలో చదువుకున్న, సంపన్న కుటుంబాలకు చెందినవారే ఎక్కువ శాతం విడాకులు తీసుకుంటున్నారని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు… చదువు, డబ్చు కలిగి ఉంటే అహంకారం వస్తుందని, కుటుంబాలు ముక్కలుగా చీలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు కొందరికి నచ్చలేదు.. విడిపోయే వారు అందరూ వారేనా.. కలిసి ఉన్నవాళ్లల్లో ఎంత మంది ధనవంతులు ఉన్నారు అని కొందరు ఆయన మాటలపై విమర్శలు చేశారు.

దీనిపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ మనిషి అసలు ఇలా ఎలా మాట్లాడతారు? అని ఆమె ప్రశ్నించారు. ఇవి తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే వ్యాఖ్యలని ఆమె ట్వీట్ లో మండిపడ్డారు, దీనిపై ఆరెస్సెస్ నేతలు వాదులు కూడా ఆమె కామెంట్లపై విమర్శలు చేస్తున్నారు.