‘బంగార్రాజు’ నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్

Song teaser release for 'For Me' from 'Bangaraju'

0
95

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబోలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన లడ్డుండా పాట, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య, కృతిశెట్టి మధ్య తెరకెక్కిన ‘నాకోసం’ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. “నా కోసం మారావా నువ్వు .. లేక నన్నే మార్చేశావా నువ్వు” అంటూ ఈ పాట సాగుతోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5:12 నిమిషాలకు పూర్తి లిరికల్ సాంగును రిలీజ్ చేయనున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=WfA48Nulxlk&feature=emb_title

పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున సందడి చేయనున్న ఈ సినిమాలో, ఆయన వారసుడిగా చైతూ కనిపించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారు. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.