ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

0
96

మన ప్రపంచంలో ఉన్న అనేక ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్లను ఎంచుకుంటాయి, ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు హీరోయిన్ లు నటులని ఎంపిక చేస్తారు, అయితే సమాజానికి సేవ చేస్తూ ముందుకు సాగేవారిని కూడా ఎంచుకుంటే ప్రజల్లో మరింత ఆ ప్రొడక్ట్ చేరుతుంది అనేది తెలిసిందే.

దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోనూ సూద్ ఏసర్ ఇండియా ల్యాప్టాప్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారని సంస్థ ప్రకటించింది. మన దేశంలో చాలా ల్యాప్ టాప్లు ఏసర్ వే అమ్మకం జరుగుతాయి.

ఏసర్లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది. . తమ సంస్థకు సోనూ సూద్ లాంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ ప్రమోషన్ చేయడం సంతోషకరమని తెలిపింది…ఏసర్ ఇండియా 1976లో స్థాపించబడింది. ఇక కంపెనీ ప్రమోషన్లు యాడ్స్ లో సోనూ కనిపించనున్నాడు.