విద్యార్ధుల కోసం సోనూసూద్ మ‌రో వ‌రం -ఏం చేస్తున్నాడంటే

-

ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో సాయం కోరిన వారికి నేనున్నా అని ముందుకు వ‌చ్చారు సినీ న‌టుడు సోనూసూద్, ఎంద‌రికో ఆయ‌న సాయం చేశారు, అంతేకాదు ఆపద్బాంధవుడిగా మారిపోయాడు, సినిమాల్లో విల‌న్ కాని రియ‌ల్ లైఫ్ లో ఆయ‌న హీరో అనే చెప్పాలి.

- Advertisement -

వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకునేందుకు పేద ప్ర‌జ‌ల‌కు కార్మికుల‌కి ఎన్నో సదుపాయాలు కల్పించి తన గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. సోనూ తాజాగా విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వారికి కూడా అండగా నిలబడేందుకు ముందుకు కదులుతున్నాడు.

ఇక ట్ర‌స్ట్ ద్వారా విద్యార్దుల‌కు ఆర్దిక సాయం స్కాల‌ర్ షిప్ అందించాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు,
కరోనా కష్టకాలంలో ప్రైవేట్ కాలేజీ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టకూడదు అంటూ తెలిపారు.. బీహార్ అస్సాం గుజరాత్ రాష్ట్రాలలో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా రోజురోజుకు వరద పెరిగిపోతోంది, ఇక్క‌డ విద్యార్దుల‌కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మ‌రీ ముఖ్యంగా వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష‌లు జ‌రుగుతున్నాయి, వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకుని వారికి సాయం చేస్తున్నాడు.

జెఈఈ నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చాడు. త‌న టీమ్ వారికి సాయం చేస్తుంది అని తెలిపాడు సోనూ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...