సోనూసూద్ రియ‌ల్ లైఫ్ స్టోరీ

సోనూసూద్ రియ‌ల్ లైఫ్ స్టోరీ

0
83

సోనూ సూద్ ఒ గొప్ప సినీ క‌ళాకారుడు అనే చెప్పాలి, అంత‌కు మించి మంచి మ‌న‌సున్న హీరో, రీల్ లైఫ్ లో విల‌న్ అయినా రీయ‌ల్ లైఫ్ లో మాత్రం హీరో అనే చెప్పాలి, తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు ఆయ‌న‌, సినిమాల్లోకి రాక‌ముందు నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.

సోనూ సూద్ పుట్టింది 1972 ఆయ‌న పంజాబ్ లో పుట్టారు. ఆయ‌న జీవిత భాగస్వామి పేరు సోనాలి..
1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు.

2000 లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. త‌ర్వాత . 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ఇక తెలుగులో సూప‌ర్ సినిమాలో మంచి ఫేమ్ వ‌చ్చింది, ఇక త‌ర్వాత . అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.

ఇప్పుడు ఎక్క‌డ విన్నా అత‌ని పేరు వినిపిస్తోంది, ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు, పేద‌ల‌కు సాయం కూడా అలాగే చేస్తున్నారు ఆయ‌న‌, దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆయ‌న పేరు మార్మోగిపోతోంది.