త్వరలోనే ‘ఆర్య 3’..సుకుమార్​ క్లారిటీ

Soon 'Arya 3' .. Sukumar Clarity

0
111

అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కలయికలో వచ్చిన ‘ఆర్య’ సిరీస్‌ చిత్రాలు ఎంతగా హిట్​ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సిరీస్​లో భాగంగా ‘ఆర్య 3 తీసుకురానున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సుకుమార్..’పుష్ప’ సినిమాతో పాటు ‘ఆర్య 2’ సీక్వెల్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘పుష్ప ది రైజ్‌’ కచ్చితంగా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు. ఈ చిత్రంలో సునీల్‌ ఓ ప్రధాన విరోధిగా కనిపిస్తారని, ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర క్లైమాక్స్‌లోనే ప్రవేశిస్తుందని స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘ఆర్య 3’ ఉంటుందా అని ప్రశ్నించగా.. కచ్చితంగా ఉంటుందని చెప్పారు. సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ప్రస్తుతం తొలి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించనున్నాడు.