సౌత్ ఇండియాలో రామ్ సరికొత్త రికార్డు షాకైన టాలీవుడ్

సౌత్ ఇండియాలో రామ్ సరికొత్త రికార్డు షాకైన టాలీవుడ్

0
74

మన తెలుగు సినిమాలు ఇటీవల బాలీవుడ్ లో కూడా షేక్ చేస్తున్నాయి.. ఖాన్ సినిమాలే కాదు ఇక్కడ తెలుగు చిత్రాలు కూడా అక్కడ అభిమానులని అలరిస్తున్నాయి.. అందుకే తెలుగు చిత్రాలని డబ్ చేసి హిందీలో విడుదల చేస్తున్నాయి చాలా యూ ట్యూబ్ సంస్ధలు.. ఇలా సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నాయి పలు సంస్ధలు.

రామ్ నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం హిందీలో డబ్ అయింది, దర్శకుడు త్రినాథరావ్ నక్కిన రూపొందిన ఈ చిత్రం తెలుగులో డీసెంట్ హిట్ అయింది. దీన్ని హిందీలోకి ధూమ్ ధార్ ఖిలాడీ గా డబ్ చేశారు. అయితే ఇది అనుకున్నదానికంటే పది రెట్లు అక్కడ వ్యూస్ సంపాదించింది.

ఈ హిందీ వెర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. సుమారు 141 మిలియన్ల వ్యూస్, మిలియన్ లైక్స్ సాధించింది. ఇంత బాగా నచ్చిన సినిమాగా రికార్డు కెక్కింది ఈ చిత్రం… మిలియన్ లైక్స్ వచ్చిన తొలి దక్షిణాది సినిమాగా కొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో హీరో రామ్ చాలా ఆనందంగా ఉన్నారు
మీ అందరి పిచ్చి ప్రేమకు థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పారు..ఇస్మార్ట్ శంకర్ ఇటీవల మంచి సక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే