ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తన జీవితంలో అందుకున్న పురస్కారాలు ఇవే…

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తన జీవితంలో అందుకున్న పురస్కారాలు ఇవే...

0
118

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.

1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు.

తర్వాత సాగర సంగమం 1983 రుద్రవీణ 1988 చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు

పద్మశ్రీ
డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 1999 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా
పద్మభూషణ్ 2011
శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం 2016 కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా
నంది పురస్కారం – 2012 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి మిథునం