పవన్ కు ప్రత్యేక విమానం ఎవరిచ్చారో తెలుసా…

పవన్ కు ప్రత్యేక విమానం ఎవరిచ్చారో తెలుసా...

0
99

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు… ఏపీ రాజకీయాల్లో పార్టీ తరపున సమీక్షలు సమావేశాలు ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు… మరోవైపు హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పింక్ రీమేక్ చిత్రంలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలు ఇటు సినిమా రెండింటిన ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తున్నారు…

కొద్దికాలంగా అమరావతిలో నెలకొన్న పరిస్థితిలపై ఆరాతీస్తూ ముమ్మరంగా పోరాటం చేస్తున్నారు పవన్… ఇక అక్కడనుంచి హైదరాబాద్ కు రావడానికి పవన్ కు సుమారు ఆరుగంటల సమయం పడుతుంది.. అందుకే చిత్ర షూటింగ్ విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పింక్ మూవీ నిర్మాత దిల్ రాజ్ పవన్ కోసం ప్రత్యేకంగా ఒక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

అందుకోసం దిల్ రాజు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… పింక్ మూవీ షూటింగ్ కోసం పవన్ కేవలం 50 క్యాల్షీట్లు ఇచ్చారని అందుకే ఆసమయాన్ని ఆదాచేయాలని దిల్ రాజు పవన్ కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి…