శ్రీముఖి కాల్స్ గురించి సీక్రెట్ చెప్పిన రాహుల్

శ్రీముఖి కాల్స్ గురించి సీక్రెట్ చెప్పిన రాహుల్ )

0
96

బిగ్బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంచి జోష్ మీద ఉన్నాడు.. పలు షోలు ఇంటర్య్వూలతో బిజీ బిజీగా ఉన్నాడు, ఇక ఆయనతోపాటు మరో కంటెస్టెంట్ పునర్ణవి కూడా బిజీగా మారిపోయింది, అయితే రన్నర్ అయిన శ్రీముఖి కూడా కొంచెం సరదాగా టూర్ కు కూడా తన కుటుంబంతో వెళ్లి తిరిగి వచ్చింది.. పలు షోలతో ఇఫ్పుడు ఆమె బిజీగా ఉంది.. అయితే శ్రీముఖికి రాహుల్ కు ఇంట్లో ఉన్న సమయంలో ఎన్ని గొడవలు అయ్యాయో తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహితులిగా అక్కడకు వెళ్లి శత్రువులు అయ్యారు.

హౌస్ నుంచి బయటకు వచ్చినా కూడా వీరిద్దరి మధ్య కోల్డ్వార్ కొనసాగుతోంది. వీటికి బలం చేకురుస్తూ తాజాగా శ్రీముఖిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు రాహుల్.. ఈ నెల 29న ఓ లైవ్ కన్సర్ట్ను ప్లాన్ చేసిన రాహుల్ దాని కోసం ఓ కీలక భేటీలో ఈ విషయాన్ని చెప్పాడు… దీనికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు. అలా ప్రముఖులని పిలిచాడు ఈ సమయంలో శ్రీముఖి గురించి ప్రశ్నించగా ఆమెకి తాను ఫోన్ చేశాను అని కాని ఆ సమయంలో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు అని చెప్పాడు.

అంతేకాదు రాహుల్ ని మాట్లాడుతున్నా అని వారికి చెప్పా, వారు రిప్లై ఇవ్వ లేదు, శ్రీముఖి ఫోటో షూట్ లో ఉంది అన్నారు, మళ్లీ తను తిరిగి కాల్ చేయలేదు అని అన్నాడు రాహుల్.. ఇక ఆమె అంత బిజీగా ఉంది అని చెప్పాడు.. అయితే శ్రీ ముఖి ఇంకా రాహుల్ తో వివాదాలు మర్చిపోలేదు అంటున్నారు తాజాగా రాహుల్ చేసిన కామెంట్లతో అభిమానులు