’సాహో’కు నెగటివిటి టాక్‌కు పవన్ ఫ్యాన్స్ కారణం

’సాహో’కు నెగటివిటి టాక్‌కు పవన్ ఫ్యాన్స్ కారణం

0
94

ఇండస్ట్రిలో పెద్ద ఎత్తున కాస్టింగ్ కౌచ్ తెర లేపిన నటి శ్రీరెడ్డి, అదే సమాయంలో ఆమె పవన్ కళ్యాణ్‌పై అను చిత వ్యాఖ్యాలు చేసి ఆయన ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. అదే నేటికి కొనసాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే నిన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమాకు చాలా వరకు నెగటివ్ టాక్ వస్తుండడంతో, ఆ టాక్ కు పవన్ అభిమానులే కారణమంటూ శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు మారరా ఏంటి, ఇప్పుడు ప్రభాస్ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఆమె తన పోస్ట్ లో తెల్పడం జరిగింది.

అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా రిప్లే ఇస్తున్నారు. శ్రీ రెడ్డి నిజానికి సాహో విషయంలో అలాంటి పోస్ట్ పెట్టి ఉండకూడదని, ఎందుకంటే పవన్ అభి మానులే కాకుండా మిగతా హీరోల అభిమానులందరూ కూడా, సాహో సినిమా, సక్సెస్ సాధించి టాలీవుడ్ కు గొప్ప పేరు తీసుకురావాలనే కోరుకున్నారు.

కాని అది ప్లాప్ అని కొందరు హిట్ అని కొందరూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. కానీ శ్రీరెడ్డి మాత్రం కేవలం పవన్ గారి ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడం సరైనది కాదంటున్నారు సినీ విశ్లేషకులు.