శ్రీ రెడ్డి కొత్త అవతారం శివుడి గెటప్ లో చిందులు

శ్రీ రెడ్డి కొత్త అవతారం శివుడి గెటప్ లో చిందులు

0
78

తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అనేక మంది మ‌హిళ‌ల‌పై లైంగిక‌ వేధింపులు జ‌రుగుతున్నాయంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక‌టి త‌ర్వాత ఒక‌టి లీక్ చేసి అప్పట్లో నటి శ్రీ రెడ్డి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే….

సినిమా అవ‌కాశాల పేరుతో నిర్మాత మొద‌లుకుని చిన్న‌పాటి అసిస్టెంట్ వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రు అమ్మాయిల‌ను లైంగికంగా వేదిస్తున్నారని శ్రీ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే… పలు విషయాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ శ్రీరెడ్డి ఈ సారి కొత్త అవతారం ఎత్తింది… దీంతో అభిమానులు ఆమెను చూసి షాక్ అవుతున్నారు… ఉన్నట్లుండి శ్రీ పరమ శివుడి గెటప్ లో కనిపించింది…

ఇద్దరు సన్యాసులతో శ్రీరెడ్డి కలిసి చిందులు వేస్తూ టిక్ టాక్ చేసింది… ప్రస్తుతం ఆమె చేసిన టిక్ టాక్ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.. దీంతో ఆమె అభిమానులు సడన్ గా ఈ దర్శనం ఏంటని అంటున్నారు… ఇక దీనిపై స్పందించిన శ్రీ తన కెరియర్ డెవలప్ మెంట్ లో భాగమని సమాధానం ఇచ్చింది… ఈ గెటప్ సూట్ కాలేదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేయగా ఆమె అచ్చం శివుడిలానే ఉందని మరికొందరు అంటున్నారు..