అతిలోకసుందరి శ్రీదేవి మరణించి దాదాపు ఏడాదిన్నర అవుతున్న సమయంలో ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు కేరళ డీజీపీ(జైళ్లు) రిషిరాజ్ సింగ్. కేరళ కౌముది అనే పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె బాత్ రూమ్‌లో ప్రమాదవశాత్తు టబ్ లో పడి చనిపోయి ఉండకపోవచ్చని రిషిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిత్రుడైన ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ ఉమదతన్,తనకు మధ్య జరిగిన సంభాషణలో ఉమదతన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అందులో తెలిపారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఉమదతన్ ఇప్పుడు జీవించిలేరని అన్నారు. శ్రీదేవిది సహజ మరణం అయి ఉండకపోవచ్చని ఉమదతన్ అన్నట్టు రిషిరాజ్ తన కాలమ్ లో తెలిపారు. ఏ వ్యక్తి ఒక అడుగు లోతు ఉన్న టబ్ లో మునిగిపోయే అవకాశం లేదని…ఎవరో రెండు కాళ్లు పట్టుకుని తలను నీటిలో ముంచితే తప్ప ఇలా జరగదని అన్నారపి తెలిపారు.
ఫిబ్రవరి-24,2018న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవిది సహజ మరణమా లేక అసహజ మరణమా అనే అంశంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ఆమెది సహజ మరణమే అని స్పష్టత ఇవ్వడంతో… ఈ అనుమానాల ఎపిసోడ్‌కు తెరపడింది. అయితే శ్రీదేవి చనిపోయిన ఏడాదిన్నర తరువాత ఇప్పుడు మళ్లీ ఆమె మరణం సహజం కాదంటూ కేరళ డీజీపీ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
శ్రీదేవిది సహజ మరణం కాదు…హత్య!
శ్రీదేవిది సహజ మరణం కాదు...హత్య!