మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఉంది, ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు అందరూ ఎక్కువగా హైదరాబాద్లో జూబ్లి హిల్స్, ఫిల్మ్ నగర్లో ఉంటారు… ఇక బాలీవుడ్ లో కూడా బీ టౌన్ హీరోలు హీరోయిన్లు నటులు చాలా మంది ముంబైలో జుహు ప్రాంతం లో ఎక్కువగా ఉంటారు..సినిమా సెలబ్రెటీల హౌస్ లు మొత్తం ఈ ఏరియాలో ఉంటాయి.
అందుకే ఇక్కడ ఇళ్ల రేట్లు కూడా చాలా ఖరీదు ఉంటాయి.. ఇక ఇక్కడ చాలా ఖాళీస్దలాలు కొనుగోలు చేసి తమ అభిరుచికి తగిన విధంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.. ఇక చాలా మంది ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు బాలీవుడ్ ప్రముఖులు.
ఇక్కడే సెలబ్రెటిలు ఆస్తులు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.. తాజాగా బీ టౌన్ లో ఓ వార్త వినిపిస్తోంది… శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలోని జుహు ఏరియాలో సొంతిటి కలను నిజం చేసుకుందట.
ఇక అలియా భట్, రణ్బీర్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ఇటీవల ఖరీదైన నివాసాలు కొనుగోలు చేశారు
జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుంది జాన్వీ అని వార్తలు వినిపిస్తున్నాయి…. తాజాగా ఈ వార్త బాలీవుడ్ లో వినిపిస్తోంది… ఇది మూడు అంతస్తుల భవనం, ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.