శ్రీహరి బయోపిక్ శ్రీహరిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా ?

శ్రీహరి బయోపిక్ శ్రీహరిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా ?

0
90

శ్రీహరి అద్బుత‌మైన న‌టుడు, విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి, అయితే శ్రీహరి క్యాన్సర్ తో హఠాత్తుగా ఈలోకం నుంచి వెళ్ళిపోయారు, ఇక ఎన్నో మంచి ప‌నులు చేసి సినిమా ఇండ‌స్ట్రీలో ఓ మంచి స్ధానానికి చేరుకున్నారు ఆయ‌న‌.

అయితే ఆయ‌న భార్య వారి కుమారులు ఇప్పుడు సినిమా ప‌రిశ్రమ‌లో ఉంటున్నారు. ఇక ఇప్పుడు బ‌యోపిక్ హావా టాలీవుడ్ లో న‌డుస్తోంది, ఈ స‌మ‌యంలో శ్రీహ‌రి బ‌యోపిక్ కూడా రానుంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రియల్ హీరో శ్రీహరి బయోపిక్ ని ఆయన సతీమణి డిస్కో శాంతి తెరకెక్కించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొడుకునే హీరోగా పెట్టి ఈ మూవీ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఆయ‌న చిన్న‌త‌నం నుంచి ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సాధించిన విజ‌యాలు ఇలా అన్నీఆ చిత్రంలో చూపించాలి అని భావిస్తున్నార‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న రానుంది అని తెలుస్తోంది.