శ్రీనివాస రెడ్డి భాగ్యనగరవీధుల్లో ఏం చేస్తున్నాడు..!!

శ్రీనివాస రెడ్డి భాగ్యనగరవీధుల్లో ఏం చేస్తున్నాడు..!!

0
97

కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో ఒకరు శ్రీనివాస్ రెడ్డి.. అయన హీరో గా చేసిన పలు సినిమాలు సూపర్ హిట్ కాగా, తాజగా మరో సినిమా లో ఆయన హీరో గా నటిస్తున్నట్లు తెలుస్తుంది..కాకపోతే ఈసారి ఆయా దర్శకత్వం, నిర్మాత అవతారం ఎత్తారు కూడా.. దర్శక నిర్మాతగా ఆయన తాజాగా చేస్తున్న చిత్రమే ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’.

పూర్తి హాస్యరసభరితంగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను విడుదల చేశాడు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సినిమాలో షకలక శంకర్ .. సత్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ‘మంచి రసగుల్లా లాంటి సినిమా’ అంటూ వదిలిన ఈ పోస్టర్లో ఈ ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.