మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. ‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయడం వెనుక మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్ హస్తం ఉందని ఆరోపించింది. ఎన్నో ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న ‘మా’ అసోసియేషన్ చేజారిపోయినందుకు నాగబాబు, పవన్ క్రియేట్ చేసిన డ్రామా అని పేర్కొంది.
‘మా’ ఎలక్షన్స్‌లో అన్యాయం జరిగిందంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ వారిపై విరుచుకుపడింది. నటులు హేమ, ప్రగతి, ఉత్తేజ్, బెనర్జీ, తనీశ్, శ్రీకాంత్‌ను తీవ్రంగా దూషించింది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమిని అంగీకరించాలని హితవు పలికింది శ్రీరెడ్డి. ‘మా’కు సేవ చేస్తానని చెప్పిన వాళ్లు చిత్ర పరిశ్రమను రెండుగా ఎందుకు చీలుస్తున్నారని ప్రశ్నించింది. మోహన్‌బాబు చిత్రసీమకు పెద్దదిక్కులాంటివారని, ఆయన నిజాయితీ గల మనిషని కితాబిచ్చింది.