పుష్ప నుండి ‘శ్రీవల్లి’ వీడియో సాంగ్​ వచ్చేసింది! (వీడియో)

'Srivalli' video song from Pushpa!

0
119

ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ నటించిన సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చూపే బంగారమాయెనే, ఊ అంటావా మామ, దాక్కో దాక్కో మేక సాంగ్స్ మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

గత డిసెంబర్​ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బన్నీ గెటప్​, నటన సినిమాకు హైలైట్​గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ నుండి ‘శ్రీవల్లి’ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. భాస్కరభట్ల​ అద్భుతమైన లిరిక్స్​కు తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్లు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=txHO7PLGE3o

తాజాగా ఈ చిత్రం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్​-100 గ్లోబల్​ సాంగ్స్​ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్​గా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. త్వరలోనే పార్ట్​2ను (పుష్ప: ది రూల్) తెరకెక్కించనున్నారు సుకుమార్.