మహేశ్ బాబు అభిమానులకు నిర్మాత హెచ్చరిక

SSMB28

SSMB28 |సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేశ్ బాబు సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా.. విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ జోషల్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌కు #SSMB28 నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య స్టార్ హీరోల అభిమానులు.. అప్‌డేట్స్ అప్‌డేట్స్ అంటూ నిర్మాణ సంస్థలనుతెగ విసిగిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా అప్పటి నుంచి ఈ విసిగింపు మరీ ఎక్కువైంది. ఎంత అంటే.. నిర్మాణ సంస్థలను బెదిరించే స్థాయికి ఫ్యాన్స్ వెళ్లిపోయారు.

స్టార్ హీరోలతో సినిమాలంటే.. నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్నా, సినిమా పూర్తయినా.. నిర్మాతలేం దాచుకోరు. వాళ్లకి కూడా పబ్లిసిటీనే కావాలి. కానీ, ఏం అప్‌డేట్ లేకుండా.. అప్‌డేట్స్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెట్రోగిపోతుంటే వారు మాత్రం ఏం చేస్తారు. అందుకే సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా ముందస్తు హెచ్చరికను జారీ చేశారు. తాజాగా వచ్చిన SSMB28 అద్భుతమైన అప్‌డేట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారని భావిస్తున్నాను. దీని తర్వాత హైపర్ మావీ అప్‌డేట్ సూపర్ స్టార్ కృష్ణగారి బర్త్‌డే‌ని పురస్కరించుకుని ‘మే’లో ఉంటుంది. అప్పటి వరకు మీరంతా ఓపికగా వేచి చూస్తారని భావిస్తున్నాను’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: కొత్త జీవితం ప్రారంభించా.. మీ సపోర్ట్ నాకు కావాలి: మంచు మనోజ్

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here