నవ్వుల సందడితో సందేశాన్ని అందించిన “సందడే సందడి” నాటిక

-

అత్యాశతో అమాయకత్వంతో మోసపోతున్న మనుషుల గురించి సరదాగా చెప్తూ ఆలోచింప జేసింది శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారి సందడే సందడి హాస్య నాటిక. కీ. శే. శ్రీ గరిమెళ్ళ రామ్మూర్తి 86వ జయంతి వేడుకలను చాట్ల శ్రీరాములు థియేటర్ ట్రస్ట్ వారు రవీంద్ర భారతిలో రంగస్థల పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఈ నాటికకు డా శ్రీజ సాదినేని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ముఖ్య పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.

- Advertisement -

అత్యాశతో, అమాయకత్వంతో భర్తను ఇబ్బందుల్లో పడేసే భార్య, భార్యను అమితంగా ప్రేమించే భర్త, ఇది అలుసుగా తీసుకుని వారి దగ్గర డబ్బులు కాజేసే బావమరిది… వీరి ఇంట్లో దొంగ తనానికి వచ్చి ఇరుక్కుపోయిన దొంగ… వీరి మధ్య సరదాగా సాగిన సన్నివేశాలతో ఈ నాటిక ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. డా. శ్రీజ సాదినేని, శశిధర్ ఘణపురం, ధాతేశ్వర్, రత్నయ్య ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. సంగీతం లీలా మోహన్ సమకూర్చగా అవినాష్ సెట్ డిజైనింగ్ అందించారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...