స్టార్ కమెడియన్ రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

0
106

ప్రస్తుతం సినిమాలలో నటించే హీరోలతో సమానంగా కమెడియన్స్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడంలో పెద్ద ఆశర్యమేమి లేదు. ఎందుకంటే  ఏ సినిమాలో నటించాలన్న కమెడియన్స్ తప్పనిసరి కాబట్టి వారి రెమ్యూనరేషన్ డిమాండ్ అధికంగా పెరిగింది. అందుకే ప్రేక్షకులు ఎక్కువగా  కామెడీ పై  ఆసక్తి చూపుతారని ఉద్దేశ్యంతో ఈ క్యారెక్టర్లు చేసే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది.

ఇటీవలే మీడియా న్యూస్ ఛానల్ ద్వారా సినిమాలలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బిత్తిరిసత్తి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రమక్రమంగా చిన్న పాత్రలతో సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి ప్రస్తుతం కొత్త దారిలో డబ్బులు సంపాదిస్తూ లక్షాధికారి అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం బిత్తిరి సత్తి ప్రతినెల రూ.5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తునట్టు సమాచారం తెలుస్తుంది. మొదట పని చేసిన మీడియా న్యూస్ ఛానల్ లో కేవలం వేలల్లో జీతం తీసుకునే బిత్తిరి సత్తి 3 లక్షలు తీసుకోగా..తరువాత ప్రైవేటు యాడ్ కోసం.. రూ.7 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి ఉన్నట్లుగా తెలుస్తోంది