షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడిన స్టార్ కమెడియన్..

0
92

అదిరే అభి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్ ‘ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా సంగతి తెలిసిందే. మొదటి సినిమా అనంతరం వరుస ఆఫర్ లతో యాంకర్ గా, డాన్సర్ గా, స్టాండప్ కమెడియన్ గా చేస్తూ విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకున్నాడు.

అయితే తాజాగా అదిరే అభి అభిమానులు నిరాశచెందే వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో సూపర్ హిట్ స్కిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరోకు సినిమాల్లో కూడా అవకాశాలు భారీగా దక్కించుకుంటున్నాడు. తాజాగా తను ఒక చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

ఈ క్రమంలో అదిరే అభి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ లు నిర్మిస్తుండగా.. ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురైనట్లు చిత్ర యూనిట్ లోని ఒకరు తెలిపారు. ముఖ్యంగా చేతికి, కాలికి తీవ్రగాయాలు అయ్యి పదిహేను కుట్లు పడగ..ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.