ఆ హీరోలతో స్టార్ డైరెక్టర్ మల్టీస్టారర్?

Star director multistarrer with those heroes?

0
120

కమర్షియల్‌ కథకు, సందేశం జోడించి సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివకు తిరుగు లేదు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడు ‘ఆచార్య’కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. రామ్‌చరణ్‌ ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారు.

గతంలోనూ ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో ‘జనతా గ్యారేజ్‌’ను కొరటాల తెరకెక్కించారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. బాలకృష్ణ కోసం కొరటాల ఒక పవర్‌ఫుల్‌ కథ సిద్ధం చేశారట. ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉండటం వల్ల మరో ఆ హీరో ఎవరు? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం మహేశ్‌బాబు పేరు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కొరటాల ఇప్పటికే ఆయనతో రెండు సినిమాలు చేశారు. దీంతో మహేశ్ ఓకే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయన కాదంటే మరో  కథానాయకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట.

పైగా అటు కొరటాలకు, ఇటు బాలయ్యకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని, ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. మరోవైపు కొరటాల ఆచార్యను పూర్తి చేసి, ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది.