షాకింగ్- భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ డైరెక్టర్

0
76

సినీ పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు విడాకులు తీసుకున్నారు.

దర్శకుడు బాల తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాలాకి ముత్తు మలర్ తో 17 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఇద్దరి దంపతులకు ఒక పాప ఉండగా… ఇద్దరి మధ్య విభేదాల కారణంగా నాలుగు సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టు ను ఆశ్రయించగా తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. బాల దర్శకత్వం వహించిన వాడు-వీడు, శేషు, శివపుత్రుడు లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.