Flash: స్టార్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం..పుట్టెడు దుఃఖంలో కుటుంబసభ్యులు

0
79

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీకళ్యాణి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెంది వారి కుటుంబంలో ఎనలేని బాధను మిగిల్చారు.

వీరిద్దరికి 1960లో వివాహం కాగా.. సింగీతం సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇతనికి సహాయం చేయడంలో లక్ష్మీకళ్యాణి కీలక పాత్ర పోషించేది. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. ఈ మరణవార్తను స్వయంగా సింగీతం శ్రీనివాసరావుసోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈమె మరణం పట్ల కొంత మంది సినీ ప్రముఖులు  కుటుంబసభ్యులకు సానుభూతి తేలియజేస్తున్నారు.