థలపతి విజయ్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో..

0
97

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ ఉన్నాడు. ఇప్పటికే 65 సినిమాలు నటించి మంచి క్రేజ్ లో ఉన్న ఈ హీరో  ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 66 చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జంటగా రష్మిక మందన నటిస్తుంది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమలో స్టార్ హీరో విలన్ గా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఇటీవలే హీరోగా చాలా సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నాడు.

కేవలం హీరోగానే కాకుండా అఖండ సినిమాలో విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. కేవలం ఈ హీరోనే కాకుండా జగపతిబాబు సైతం విలన్ గా తనదైన శైలిలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ను విలన్ గా చిత్రబృందం ఓకే చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి శ్రీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. చూడాలి మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవముందో!