వెబ్ సిరీస్ లో తెలుగు స్టార్ హీరో…

వెబ్ సిరీస్ లో తెలుగు స్టార్ హీరో...

0
104

కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.. ఇప్పటికే హాలీవుడ్ బాలీవుడ్ మొదలగు అన్ని ప్రాంతాల వారు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే…

గతంలో… సినిమాలో అవకాశాలు లేనివారు మాత్రమే వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారనే వార్తలు వచ్చాయి అయితే ఆ అభిప్రాయాన్ని తుడిచేస్తూ స్టార్ డమ్ వున్న ఆర్టిస్టులు సైతం వెబ్ సిరీస్ లను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు…

ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు ఒక వెబ్ సీరిస్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా కొన్నిరోజుల క్రితం నుంచి వార్తలు వస్తున్నాయి… తాజాగా ఇప్పుడు విక్టరి వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది… వెబ్ సిరీస్ లో ఫ్యామిలీస్ ఎక్కువగా చూస్తుండటంతో వెంకటేష్ తో ఒక సీరిస్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అని సురేష్ బాబు ఆలోచిస్తున్నారట,. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఆయన దర్శకుడు తేజాతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…