ప్రస్తుతం గోపిచంద్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ ఫేమ్ లో ఉన్నాడు. ఇప్పటికే 25 సినిమాలకు పైగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలలో నటించి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. తాజాగా మూడవ సినిమా పట్టాలెక్కించడానికి సిద్దమయ్యాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతున్న నేపథ్యంలో గోపీచంద్ కాలు కొద్దిగా స్లిప్ అయ్యి ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఓక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది.
దాంతో హీరో ను సమీప ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఎలాంటి సమస్య లేదని నిర్దారించారు. ప్రస్తుతం గోపీచంద్‌కు ఎలాంటి ప్రమాదం లేదని..సురక్షితంగానే ఉన్నదని డైరెక్టర్ వెల్లడించారు. అభిమానులు ఎవరు కంగారు పడవల్సిన అవసరం లేదని చిత్రబృందం ఈ మేరకు తెలియజేసింది.