స్టార్ హీరో మంచు విష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీస్తూ అందరిని మెప్పిస్తుంటాడు. ఈ క్రమంలో సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు. ఇది ఇలా ఉండగా..తాజాగా హీరో మంచు విష్ణు..జిన్నా మూవీ షూటింగ్ సెట్ లో గాయపడినట్లుగా తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా కాలికి గాయమైంది అంటూ తన ఇన్స్టా స్టోరీలో పిక్ షేర్ చేశారు.