Flash: షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో (వీడియో)

Star hero injured in shooting (video)

0
110

పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్‌  హీరో విశాల్. విశాల్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవలే ఎనిమి సామాన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ మరో సినిమాను తెరకెక్కించాడు.

ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ అనే సినిమా చేస్తున్నాడు విశాల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో విశాల్ చేతికి, నుదిటి భాగంలో గాయమైంది. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు విశాల్. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనితో విశాల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విశాల్ కేరళలో చికిత్స పొందుతున్నారు.

లాఠీ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో సునయన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పందెకోడి, డిటెక్టివ్, సామాన్యుడు సినిమాలతో తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా గతంలోనూ ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ షూట్‌లో తీవ్రంగా గాయపడ్డారు విశాల్‌. ఫైట్‌ సీక్వెన్స్‌ సమయంలో సమన్వయ లోపం ఏర్పడటంతో ఆయన తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. తాజాగా లాఠీ సినిమా షూటింగ్ విశాల్ గాయపడ్డారు.

https://twitter.com/VishalKOfficial?